ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపెనీలపై ఏజీఆర్‌ బకాయిల బండ

ABN, First Publish Date - 2021-07-25T06:18:47+05:30

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుల కేసులో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుల కేసులో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్‌ బకాయిలపై గత తీర్పును మార్చేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, ఈ బకాయిల విషయంలో భవిష్యత్‌లో ఎలాంటి వివాదానికి తావుండబోదని కంపెనీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏజీఆర్‌ బకాయిల గుదిబండను దించుకునేందుకే కంపెనీలు చార్జీల పెంపు బాట పట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ పరిణామం వొడాఫోన్‌ ఐడియాపై అధిక ప్రభావం చూపనుంది. ఒకవైపు కస్టమర్లు, ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీకి వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించడం గగనమే. ఈ నేపథ్యంలో కంపెనీలోకి రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని కంపెనీ కేంద్రాన్ని కోరింది. ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడిస్తే, అనుమతివ్వడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది. టెలికాం శాఖ లెక్కల ప్రకారం..వొడాఫోన్‌ఐడియా రూ.58,245కోట్లు,ఎయిర్‌టెల్‌ రూ.43,980కోట్ల బకాయిలు చెల్లించా లి. ఎయిర్‌టెల్‌ ఇప్పటికే రూ.18,004 కోట్లు చెల్లించగా.. వొడాఫోన్‌ రూ.7,854 కోట్లు చెల్లించింది. 

Updated Date - 2021-07-25T06:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising