ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా కుబేరుల్లో అదానీ నెం.2

ABN, First Publish Date - 2021-05-21T06:03:38+05:30

అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద మరింత పెరిగింది. దాంతో ఆయన ఆసియా లో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి రెండు స్థానాలు మనోళ్లవే.. 


న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద మరింత పెరిగింది. దాంతో ఆయన ఆసియా లో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బ్లూంబ ర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం.. ఇంతవరకూ ఆసియా నెం.2గా కొనసాగిన చైనా పారిశ్రామికవేత్త జోంగ్‌ షాన్షాన్‌ ఆస్తి 6,360 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీతో గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద  6,650 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.86 లక్షల కోట్లు) పెరిగింది. దాంతో ఆయన షాన్షాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి 3,270 కోట్ల డాలర్ల మేర పెరగగా.. షాన్షాన్‌ ఆస్తి 1,460 కోట్ల డాలర్లు క్షీణించింది. ఇక ఆసియా నెం.1 అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో సుమారు రూ.5.58 లక్షల కోట్లు. ప్రస్తుతం ప్రపంచ శ్రీమంతుల జాబితాలో అంబానీ 13, అదానీ 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, షాన్షాం గ్‌ 14 నుంచి 15వ స్థానానికి జారుకున్నారు. 

Updated Date - 2021-05-21T06:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising