ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో 4 సీఎన్‌జీ కార్లు : మారుతి సుజుకీ

ABN, First Publish Date - 2021-10-29T08:59:27+05:30

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నానాటికీ పెరుగుతూ ఉండడంతో సీఎన్‌జీ కార్లకు డిమాండు పెరిగిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు తాము సీఎన్‌జీ కార్లను విస్తరిస్తామని మారుతి సుజుకీ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నానాటికీ పెరుగుతూ ఉండడంతో సీఎన్‌జీ కార్లకు డిమాండు పెరిగిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు తాము సీఎన్‌జీ కార్లను విస్తరిస్తామని మారుతి సుజుకీ ప్రకటించింది. త్వరలోనే నాలుగు సీఎన్‌జీ వేరియెంట్లు మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మారుతి సీనియర్‌ ఈడీ (మార్కెటింగ్‌, అమ్మకాలు) శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు  ప్రస్తుతం మార్కెట్లోని 14 మారుతి మోడళ్లలో ఎనిమిది మోడల్‌ కార్లలో సీఎన్‌జీ వెర్షన్లున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో తాము మరిన్ని సీఎన్‌జీ కార్లను డిజైన్‌ చేసి మార్కెట్లోకి తెచ్చే యోచన ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద 2.8 లక్షల కార్లకు ఆర్డర్లు పెండింగలో ఉండగా 1.1 లక్షలు సీఎన్‌జీ మోడల్‌ కార్లేనని ఆయన తెలిపారు. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై కిలోమీటరు ప్రయాణానికి వ్యయం రూ.5కి చేరుకోగా సీఎన్‌జీ కార్లపై అది రూ.1.7 అని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-29T08:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising