‘స్కోడా కుషాక్’కు 3,000 బుకింగ్స్
ABN, First Publish Date - 2021-07-13T05:55:10+05:30
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌ల్లో స్కోడా కొత్తగా విడుదల చేసిన ‘కుషాక్’ కారుకు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌ల్లో స్కోడా కొత్తగా విడుదల చేసిన ‘కుషాక్’ కారుకు విశేష స్పందన లభించింది. మొత్తం 3,000 కార్లకు బుకింగ్స్ వచ్చినట్లు మహావీర్ స్కోడా తెలిపింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, భీమవరంలో కుషాక్ వాహనాలను కొనుగోలుదారులకు సోమవారం అందజేసింది. రూ.10.49 లక్షల ప్రారంభ ధర (ఎక్స్‌షోరూమ్)తో జూన్ 28 న కుషాక్‌ను స్కోడా విడుదల చేసింది. టీఎ్‌సఐ టెక్నాలజీతో రెండు సామర్థ్యాలు కలిగిన ఇంజన్లతో ఈ కారును కంపెనీ ప్రవేశపెట్టింది.
Updated Date - 2021-07-13T05:55:10+05:30 IST