ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడి నుంచి 3 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు

ABN, First Publish Date - 2021-07-23T05:43:08+05:30

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్‌ కార్ల ఎస్‌యూవీలను విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర రూ.99.99 లక్షలు-రూ.1.18 కోట్లు

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి.. భారత మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్‌ కార్ల ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఈ-ట్రాన్‌ శ్రేణిలో ఈ-ట్రాన్‌ 50, ఈ-ట్రాన్‌ 55, ఈ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55 పేరుతో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.99.99 లక్షలు, రూ.1.16 కోట్లు, రూ.1.18 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. భారత మార్కెట్లో ఒకేసారి మూడు ఎస్‌యూవీలతో ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశించామని, లగ్జరీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వీటిని రూపొందించినట్లు ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ వెల్లడించారు.


ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయం అనంతరం చార్జింగ్‌, ఓనర్‌షి్‌పకు సంబంధించి పలు ప్యాకేజీలు, బెనిఫిట్స్‌ను అందించనున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో మూడేళ్ల తర్వాత బైబ్యాక్‌ను ఆఫర్‌ను చేస్తున్నట్లు బల్బీర్‌ తెలిపారు. అంతేకాకుండా 2025 నాటికల్లా అంతర్జాతీయంగా మరో 20 ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. మరో నాలుగేళ్లలో భారత ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లో 15 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బల్బీర్‌ వెల్లడించారు. 


Updated Date - 2021-07-23T05:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising