ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయిల్‌ పీఎస్‌యూల్లో 100% ఎఫ్‌డీఐ!

ABN, First Publish Date - 2021-06-21T08:51:36+05:30

మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ప్రభుత్వం తలుపులు బార్లా తెరుస్తోంది. కొత్తగా ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు కంపెనీల ఈక్విటీలో 100 శాతం ఎఫ్‌డీఐకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

కారు చౌకగా బీపీసీఎల్‌ అమ్మకం


న్యూఢిల్లీ: మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ప్రభుత్వం తలుపులు బార్లా తెరుస్తోంది. కొత్తగా ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు కంపెనీల ఈక్విటీలో 100 శాతం ఎఫ్‌డీఐకి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం విదేశీ కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా (ఆటోమేటిక్‌ రూట్‌) నేరుగా పీఎ్‌సయూ ఆయిల్‌ కంపెనీల ఈక్విటీలో 49 శాతం వరకు వాటా తీసుకోవచ్చు. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ పరిమితిని 100 శాతానికి పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం ఒక ముసాయిదా పత్రం రూపొందించి వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాల కోసం పంపింది. కాకపోతే పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ‘సూత్రప్రాయ’ ఆమోదం తెలిపిన ఆయిల్‌ పీఎ్‌సయూలకే ఇది పరిమితమని తెలిపింది.


బీపీసీఎల్‌ కోసమే..

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ కోసమే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని భావిస్తున్నారు. బీపీసీఎల్‌ ఈక్విటీలో తనకు ఉన్న 52.98 శాతం వాటాను ప్రభుత్వం ఇప్పటికే అమ్మకానికి పెట్టింది. ఈ వాటా కోసం ప్రవాస భారతీయ పారిశామ్రికవేత్త అనిల్‌ అగర్వాల్‌ నాయకత్వంలోని వేదాంత గ్రూప్‌తో పాటు రెండు అంతర్జాతీయ ఫండ్స్‌ ప్రాథమిక బిడ్స్‌ దాఖలు చేశాయి.  కేవ లం మూడు బిడ్స్‌ మాత్రమే రావడం ప్రభుత్వాన్ని ఒకింత నిరాశ పరిచింది. వీటి ఆఫర్‌ ధర కూడా అంత ఆకర్షణీయంగా లేదని సమాచారం. దీంతో ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తోందని భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపితే.. బహుళ జాతి (ఎంఎన్‌సీ) చము రు  కంపెనీలు కూడా బీపీసీఎల్‌ ఈక్విటీ లో 100 శాతం వాటా కొనుగోలుకు ముందు కు వస్తాయని భావిస్తున్నారు. వేదాంత గ్రూప్‌ కూడా బీపీసీఎల్‌ ఈక్విటీలో 100 శాతం వాటాకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-06-21T08:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising