ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2021-03-05T06:35:25+05:30

హైదరాబాద్‌కు చెందిన రాక్‌వెల్‌ ఇండస్ట్రీస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్‌ ఫ్రీజర్‌ ‘చిల్లర్‌మిల్‌’ను విడుదల చేసిం ది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ఇది సౌర, పవన విద్యుత్‌పై పనిచేస్తుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విపణిలోకి రాక్‌వెల్‌ హైబ్రిడ్‌ ఫ్రీజర్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన రాక్‌వెల్‌ ఇండస్ట్రీస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్‌ ఫ్రీజర్‌ ‘చిల్లర్‌మిల్‌’ను విడుదల చేసింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ఇది సౌర, పవన విద్యుత్‌పై పనిచేస్తుంది. వాణిజ్య అవసరాలకు చిల్లర్లు/ఫ్రీజర్లను తయారు చేస్తున్న కంపెనీ కొత్తగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఫ్రీజర్ల శ్రేణిని కూ డా ప్రవేశపెట్టింది. టీకాలు, ఇతర ప్రాణాధార ఔషధాలను నిల్వ చేసుకోవడానికి వీలుగా హైబ్రిడ్‌ ఫ్రీజర్‌ను అభివృద్ధి చేసినట్లు రాక్‌వెల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ అశోక్‌ గుప్తా తెలిపారు. పవన, సౌర విద్యుత్‌తో పని చేసే  చిల్లర్లను తెలంగాణ పరిశ్రమల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ విడుదల చేశారు. కొత్త హైబ్రిడ్‌ చిల్లర్లు/ఫ్రీజర్లను మేడ్చల్‌ యూనిట్‌లో తయారు చేస్తామని అశోక్‌ గుప్తా అన్నారు.

  

రోజుకు 2,000 ఫ్రీజర్ల తయారీ: కాగా కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న  రెండు తయారీ యూనిట్లలో రోజుకు 1,000 చిల్లర్లు/ఫ్రీజర్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దీన్ని వచ్చే మూడేళ్లలో 2,000 ఫ్రీజర్లకు పెంచుకోవాలని భావిస్తున్నామని..ఇందుకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు. కొత్త హైబ్రిడ్‌ ఫ్రీజర్ల విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం రూ.125 కోట్లు ఉన్న ఆదాయం త్వరలోనే రూ.200 కోట్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-05T06:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising