నేడు మత్స్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం
ABN, First Publish Date - 2021-05-18T14:11:58+05:30
సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన
అమరావతి : సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు జగన్ సర్కార్ అండగా నిలబడుతోంది. మత్స్యకారులకు ‘వైఎస్సార్ మత్స్యకారుల భరోసా పథకం’ ద్వారా 10 వేల రూపాయలు జగన్ సర్కార్ నేడు ఆర్థిక సాయం చేయనుంది. ఇవాళ ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి.. ఆన్‌లైన్ ద్వారా నేరుగా అర్హుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం ద్వారా 1,19,875 కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు సమాచారం.
Updated Date - 2021-05-18T14:11:58+05:30 IST