ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలనలో YS Jagan అట్టర్‌ ఫ్లాప్‌..: ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2021-11-27T19:23:26+05:30

పాలనలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టర్ ప్లాప్ అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి/అమరావతి : పాలనలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టర్ ప్లాప్ అని మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ జగన్‌ పాలనపై ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడని ఉండవల్లి.. ఒక్కసారిగా ఈ రేంజ్‌లో మాట్లాడేసరికి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. శనివారం నాడు రాజమండ్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. జగన్‌ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగని ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మరీ జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనందునే వరుసగా గెలుస్తూ వస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బాగా పరిపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అయితే.. జగన్ మాత్రం ఈ రెండేళ్లలోనే ఘోరంగా విఫలమయ్యారని ఉండవల్లి చెప్పుకొచ్చారు. జగన్‌ పాలనలో అవినీతి లేదని ఎవరైనా చెప్పగలరా..? అని ఆయన ఒకింత సవాలే విసిరారు.


ఇలాగైతే కష్టమే..!

ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడిన ఉండవల్లి.. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని మండిపడ్డారు. అప్పుల కోసం అన్నింటినీ ఒప్పుకుంటున్నారని విమర్శించారు. ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఉండదని ఉండవల్లి హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున కాగ్ నివేదికపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. దీనిపై ఉండవల్లి మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో కాగ్‌పై చర్చ జరగనే లేదన్నారు. బడ్జెట్‌ సహా ముఖ్య అంశాలను అసెంబ్లీలో చర్చించలేదని.. అసలు ముఖ్య అంశాలను చర్చించకుండా అసెంబ్లీని పక్కదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో సంబంధంలేని అంశాలపై చర్చ జరిగిందని.. అసలు విపక్షం లేకుండా అసెంబ్లీలో ఏం చర్చిస్తారు? అని జగన్ సర్కార్‌ను ఉండవల్లి ప్రశ్నించారు. విపక్షం లేని అసెంబ్లీనా.. ఇదేం సంప్రదాయం..? ఇంత ఏకపక్షంగా అసెంబ్లీ జరగడం వల్ల ఏం లాభం..? అని వైసీపీ ప్రభుత్వం ఉండవల్లి ప్రశ్నల వర్షం కురిపించారు.


జగన్ మాట్లాడగలరా..!

కార్పోరేషన్‌ల గ్యారంటీ పరిమితిని 90 శాతం నుంచి 180 శాతానికి పెంచింది. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. మీ వ్యాపారాలకు సంబంధించిన అప్పులు తీర్చుకొని రాష్ట్రంలో మాత్రం అప్పులు చేస్తున్నారు. ఏపీ 6 లక్షల 22 వేల కోట్లు అప్పుల్లో ఉంది. జగన్ వచ్చాక 3 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గవర్నెస్ అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ గుండె మీద చేయి వేసుకొని అవినీతి రహిత పాలనపై మాట్లాడగలరా..?. ఏపీలో ప్రతీ విషయంలోనూ అవినీతి జరుగుతోంది. ఏపీలో ఉన్న ఐఏఎస్ అధికారులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేతులెత్తేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు తేడా వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పటం బాద్యతారాహిత్యం అని ఉండవల్లి ఒకింత చురకలంటించారు.

Updated Date - 2021-11-27T19:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising