ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తి దూసిన ప్రేమోన్మాదం

ABN, First Publish Date - 2021-06-19T08:15:23+05:30

ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా వెంటబడ్డాడు. ఆ యువతి కాదనడంతో గొంతుకోసి హత్యచేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమించలేదని యువతి గొంతుకోసి హత్య

ఆపై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం


బద్వేలు రూరల్‌, జూన్‌ 18: ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా వెంటబడ్డాడు. ఆ యువతి కాదనడంతో  గొంతుకోసి హత్యచేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. కడప జిల్లా బద్వేలు మండలంలో జరిగిన సంఘటన వివరాలు.. బద్వేలు మండలం చింతలచెరువుకు చెందిన గొడుగునూరు సుబ్బమ్మ, సుబ్బయ్యల కుమార్తె శిరీష (19) బద్వేలు పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన చరణ్‌ ఇంటర్‌తో చదువు ఆపేశాడు. పట్టణానికి వస్తూ పోతున్న క్రమంలో శిరీషను చూసి ప్రేమిస్తున్నానంటూ ఏడాదిగా ఆమె వెంట పడుతున్నాడు.  ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శిరీష తన ప్రేమను అంగీకరించకపోవడంతో.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని చరణ్‌ పథకం పన్నాడు. శుక్రవారం సాయంత్రం కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు.


ఆ సమయంలో శిరీష ఇంటికి సమీపంలోని తమ పొలంలో పశుగ్రాసం కోసుకుంటోంది. నేరుగా అక్కడికి వెళ్లిన చరణ్‌ శిరీషతో తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన చరణ్‌ తన దగ్గరున్న కత్తితో శిరీష గొంతు కోశాడు. శరీరంపైనా దాడిచేసి గాయపరిచాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందు కొద్దిగా తాగి అక్కడే పడిపోయాడు.  శిరీష వేసిన కేకలు విన్న గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తులు చరణ్‌కు దేహశుద్ధి చేసి రూరల్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-06-19T08:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising