ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?

ABN, First Publish Date - 2021-06-17T23:42:16+05:30

తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమరావతి: గవర్నర్ కోటాలో వైసీపీ నేత తోట త్రిమూర్తులను సీఎం జగన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇందుకు గవర్నర్ హరిచందన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు కొనసాగుతోంది. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు బెయిల్‌పై ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడాన్ని దళిత సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దళిత వ్యక్తికి శిరోముండనం చేసిన తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులును సీఎం జగన్ ఎంపిక చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


‘‘అసలు తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?. బెయిల్ రద్దు వాదన ఎందుకు గట్టిగా వినిపిస్తోంది?. ఎమ్మెల్సీ పదవి ఎందుకు వివాదంగా మారింది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-06-17T23:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising