ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరి తెగిస్తున్న వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2021-07-29T00:42:26+05:30

ఏపీలో వైసీపీ నాయకులు గూండాళ్లా వ్యహరిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బరితెగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వైసీపీ నాయకులు గూండాళ్లా వ్యహరిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బరితెగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ నేతలపై విక్షణ రహితంగా దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ ఆగడాలను అదుపు చేయాల్సిన సీఎం జగన్‌.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా దాడులకు ప్రభుత్వం, పోలీసుల సహకారం ఉండడంతో వైసీపీ నాయకులు అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. 


2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. వీధి రౌడీల్లా దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ విధానాలను, ప్రభుత్వ తీరును ఎండగడుతున్న టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారు. మాటవినని టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు చేసే టీడీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్‌, అశోకగజపతి రాజు, దేవినేని ఉమతో పాటు మాజీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు దాడులు చేశారు.


తాజాగా కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మైనింగ్‌లో అవకతకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆయనపై దాడి చేయడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలు బయటపడుతాయనే దాడులకు పాల్పడినట్టు అరోపించారు. మరోవైపు అర్ధరాత్రి పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేశారు. అరెస్టును టీడీపీ శ్రేణులు ఖండించాయి.

Updated Date - 2021-07-29T00:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising