పవన్ వైవాహిక జీవితంపై.. మంత్రి వ్యాఖ్యలు నీచాతినీచం
ABN, First Publish Date - 2021-09-29T09:02:46+05:30
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఓ మంత్రి (పేర్ని నాని) చేసిన వ్యాఖ్యలు నీచాతినీచమైన సంస్కృతి అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఒక మంత్రిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగ ద న్నారు.
దిగజారుడు మాటలతో పార్టీకి చేటు: రఘురామ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఓ మంత్రి (పేర్ని నాని) చేసిన వ్యాఖ్యలు నీచాతినీచమైన సంస్కృతి అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఒక మంత్రిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగ ద న్నారు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ఆ మంత్రికేం సంబంధమని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తే.. పార్టీకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందన్న వాస్తవాన్ని గమనించాలని సూచించారు. పవన్‌ను ఓ మంత్రి వ్యక్తిగతంగా దూషిస్తూ, కుల ప్రస్తావన కూడా తేవడం బాధాకరమన్నారు. కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు.. అంటూ విమర్శించుకోవడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని రఘురామరాజు విమర్శించారు. ఎంతో వెనుకబడిన రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను కూడా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇరిగేషన్ ద్వారా సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించడంపై దృష్టి పెట్టకుండా.. ఎంతసేపూ చేపలు, మాంసం, సినిమా టికెట్ల అమ్మకాలపై ఆసక్తి చూపడం శోచనీయమని విమర్శించారు.
Updated Date - 2021-09-29T09:02:46+05:30 IST