రాష్ట్రంలో వైసీపీ బీభత్సం సృష్టిస్తోంది: సత్యకుమార్
ABN, First Publish Date - 2021-10-21T09:36:39+05:30
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఉప ఎన్నికను నిర్వహించలేని భయానక పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఉప ఎన్నికను నిర్వహించలేని భయానక పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. అయినా పోలీసులు జోక్యం చేసుకోవడంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బద్వేలు ఉప ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు లేవు. కేంద్ర బలగాలను బద్వేలు నియోజకవర్గానికి పంపాలి. ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించాలి’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-10-21T09:36:39+05:30 IST