ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతిపరులకు బుద్ధి చెప్పండి

ABN, First Publish Date - 2021-04-16T10:22:34+05:30

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికల్లో ఓటేసే ముందు బాధ్యతగా ఆలోచించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి ఓటర్లకు యనమల పిలుపు


అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికల్లో ఓటేసే ముందు బాధ్యతగా ఆలోచించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. అరాచకాలు, అకృత్యాలు, అవినీతే లక్ష్యంగా పాలన సాగిస్తున్న వైసీపీ నేతలకు వెంకన్న సాక్షిగా  ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన జగన్‌ రెండేళ్ల పాలనలో ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదన్నారు.


పారదర్శకతలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని నేడు అట్టడుగు స్థానానికి పడదోశారని, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ధ్వజమెత్తారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించడం, దళితులపై దాడులు, దౌర్జన్యాలతో రక్షణ లేకుండా చేయడం, ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి దోపిడీకి మార్గం వేయడం, ఇళ్ల స్థలాల పేరుతో 6,500 కోట్ల దోపిడీ, మద్య నిషేధం మాటున రూ.25వేల కోట్ల కమీషన్లు దండుకుంటూ, నాణ్యత లేని మద్యంతో పేదల ఆరోగ్యాన్ని నాశనం చేయడం, మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేయడం, విశాఖలో భూకబ్జాలు, 22మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయకపోవడం, ప్రతి స్కీం ప్రారంభానికి ముందే స్కాం రూపొందించి దోచుకుతింటున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. 

Updated Date - 2021-04-16T10:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising