యలమర్రు నా సొంత గ్రామం కాదు: కొడాలి నాని
ABN, First Publish Date - 2021-02-14T22:12:04+05:30
మంత్రి కొడాలి నానికి సొంతఊరిలోనే చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఓటమిపై ఆయన స్పంధించారు.
విజయవాడ: మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఓటమిపై ఆయన స్పంధించారు. ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ‘‘యలమర్రు నా సొంత గ్రామం కాదు.. నా పూర్వికులది. యలమర్రులో నేనెప్పుడూ రాజకీయాలు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మెప్పు కొసం కొందరూ నా సొతూరిగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. 21 తర్వాత వాస్తవాలను మీడియాతో వెల్లడిస్తా.. అందరి సంగతి తేలుస్తా’’ అని కొడాలి నాని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీపై టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఈ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Updated Date - 2021-02-14T22:12:04+05:30 IST