ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేమేం పాపం చేశాం...మహిళలను కింద పడేసి తొక్కిన పోలీసులు

ABN, First Publish Date - 2021-03-08T18:05:25+05:30

మేమేం పాపం చేసాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహిళా దినోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్నఅమరావతి మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన పొట్టపై పొడిచారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదన్నారు.


జగన్‌కు పరిపాలన చేయడం చేతకావడంలేదని, ఇంత వరకు రాజధాని నిర్మాణం చేయలేదని మహిళలు విమర్శించారు. మహిళలను హింసపెడుతున్న దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీసులు, ఉద్యోగులను అడ్డంపెట్టుకుని డబ్బులు కుమ్మరించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం తప్పా అని మహిళలు నిలదీశారు.

Updated Date - 2021-03-08T18:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising