భారతీ సిమెంట్స్ ధర తగ్గిస్తారా!
ABN, First Publish Date - 2021-12-25T08:27:43+05:30
‘‘ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ ఖర్చులు పెరిగాయంటూ ఏటా సిమెంటు ధరలు పెంచుతోంది.
ఒక్క సినిమా టికెట్లపైనే ఎందుకు జులుం?: జవహర్
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ ఖర్చులు పెరిగాయంటూ ఏటా సిమెంటు ధరలు పెంచుతోంది. సినిమా టికెట్ల మాదిరిగా భారతీ సిమెంట్ ధరలను ప్రభుత్వం ఎందుకు తగ్గించదు? ఆ ధరలు ప్రజలకు భారం కాదా? ఒక్క సినిమా టికెట్లపైనే ఎందుకు జులుం?’’ అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఒక్క సినిమా టికెట్లతోనే సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయన్నట్లుగా ప్రభుత్వం సినిమా థియేటర్లపై యుద్ధం ప్రకటించిందన్నారు. ఇదే తరహా యుద్ధం సిమెంటు, స్టీలు కంపెనీలపై కూడా ప్రకటించి వాటి ధరలు కూడా తగ్గించాలని జవహర్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-12-25T08:27:43+05:30 IST