ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం విలువలు మీవి?

ABN, First Publish Date - 2021-01-10T08:08:49+05:30

దివీ్‌సను బంగాళాఖాతంలో కలిపేస్తామని పదవిలోకి రాకముందు చెప్పిన జగన్‌, తీరా అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇవ్వడం ద్వారా ఏం విలువలు పాటిస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలాంటి వ్యవస్థను నడపాలనుకుంటున్నారు?

పాదయాత్రలో ముద్దులు పెట్టడం కాదు

ప్రజల భవిత గురించి ఆలోచించండి

దివీస్‌ ప్రాంత పర్యటనలో పవన్‌

అధికారంలోకి  రాకముందు దివీ్‌సను బంగాళాఖాతంలో 

కలిపేస్తానని ఇప్పుడు అనుమతులు ఇస్తారా?: పవన్‌ కల్యాణ్‌


కాకినాడ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): దివీ్‌సను బంగాళాఖాతంలో కలిపేస్తామని పదవిలోకి రాకముందు చెప్పిన జగన్‌, తీరా అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇవ్వడం ద్వారా ఏం విలువలు పాటిస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇలాంటి విలువలతో ఎలాంటి వ్యవస్థను నడపాలనుకుంటున్నారని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్‌ బాధిత ప్రాంతంలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘ఏ పరిశ్రమకు అయినా సగటు మనిషి ఆరోగ్యం, భవిష్యత్తును చెడగొట్టే అధికారం లేదు. భూమి అనేది వారసత్వంగా వచ్చే ఆస్తి. అది జగన్‌, వైసీపీ నేతల సొంతం కాదు. ఇష్టానుసారంగా మీరు ఏది పడితే అది చేసుకుపోతే అడిగేవారు లేరనుకుంటున్నారా? పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టడం కాదు. ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. వైసీపీలా మేం పిచ్చిపిచ్చిగా తిట్లు తిట్టే వ్యక్తులం కాదు. మర్యాద ఇస్తాం. మీరు బూ తులు తిట్టినా మేం గౌరవంగా మాట్లాడతాం. ఆ గౌరవాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలి. దివీస్‌ విషయంలో సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాదని కేసులు పెడితే బాధితుల తరఫున ఎంతవరకయినా వెళ్తాం. దివీస్‌ కంపెనీకి జనసేన వ్యతిరేకం కాదు. పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తుందనేది మా అభ్యంతరం. రాదని సాంకేతికంగా నిరూపిస్తే అడ్డురాం. ఇందుకు న్యూట్రల్‌ వ్యక్తులతో కమిటీ వేసి కాలుష్యం లేదని చెబితే నమ్ము తాం. ఇస్టానుసారం చేస్తే మా సహనం పరీక్షించినట్లే’. 


వాళ్లు సూట్‌కేసు కంపెనీలు పెట్టారా..

‘‘మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి చెబుతున్నా.. మీ సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ చెప్పారని చెప్పండి. దివీస్‌ వ్యతిరేక పోరాటంలో 36మంది బాధితులను జైల్లో పెట్టారు. వాళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లేమైనా సూట్‌కేసు కంపెనీలు పెట్టారా? హత్యలు, దొమ్మీలు చేశారా? కోడి కత్తితో పొడిచారా? పొడిచినవారు, పొడిపించుకున్న వాళ్లు బాగానే ఉన్నారు. కానీ మా భూమి, మా హక్కు.... మేం కాపాడుకుంటాం అన్నవారిని జైల్లో పెడుతున్నారు. వీరిని విడిచిపెట్టి సీఎం జగన్‌ పెద్ద మనసును చాటుకోవాలి. దయచేసి వారిని బేషరతుగా విడుదల చేయండి. కాదని ఇవే పరిస్థితులు కొనసాగితే మళ్లీ వచ్చి కూర్చుంటా. దివీస్‌ కాలుష్యాన్ని సముద్రంలో కలిపేస్తాం అంటే ఒప్పుకోం. ప్రజల కన్నీళ్లపై ఎదగడం సరికాదు. లాభాల వేటలో విలువలు వదిలేసి ఇంతమందిని రోడ్డుకీడ్చడం మంచిదా?’’ అని ప్రశ్నించారు. నేను వస్తున్నా... అనగానే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఆ మాట పవన్‌ రాకముందు చెప్పాలి కదా! అన్నారు. ‘‘రేపు ఎన్నికలు వస్తే అండగా నిలవడం, నిలబడకపోవడం మీ ఇష్టం. నేను అడగను. కానీ పార్టీ పెట్టినందుకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను. ప్రజలు మావైపు నిలబడకపోయినా... ఓట్లు వేసే దగ్గర అండగా నిలవకపోయినా మాది సైద్ధాంతిక బలం. ప్రజలు జనసేన వైపు నిలబడరని చాలామంది నాతో  అంటారు. అలా అనుకుని ఇంట్లో బిడ్డలను వదిలేస్తామా? సమస్య పరిష్కారమయ్యే వరకు జనసేన అండగా ఉంటుంది. నాయకులకు ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-01-10T08:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising