ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ మతమేదో... నీ దేవుడెవరో చెప్పాలి!

ABN, First Publish Date - 2021-01-22T08:50:39+05:30

సీఎం జగన్‌కు ధైర్యముంటే తన మతమేదో, దేవుడెవరో ప్రజలకు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడి సవాల్‌


సీఎం జగన్‌కు ధైర్యముంటే తన మతమేదో, దేవుడెవరో ప్రజలకు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. గురువారం సాయంత్రం తిరుపతిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఏ మతాన్నైనా అనుసరించవచ్చునని, ఏ దేవుడినైనా పూజించవచ్చునని, అయితే దాన్ని ధైర్యంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, టీడీపీ చేపట్టిన తిరుపతి ధర్మపరిరక్షణ యాత్రను సీఎం జగన్‌ ఆదేశాలతోనే పోలీసులు భగ్నం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవస్థలను నాశనం చేసిన జగన్‌ చివరికి దేవుడిని కూడా వదల్లేదన్నారు. తమ యాత్రతో ముఖ్యమంత్రికి నష్టం కలుగుతుందనే భయంతోనో పోలీసులు యాత్రను అడ్డుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అతిగా ప్రవర్తిస్తున్న పోలీసు అధికారుల చిట్టా తమ వద్ద ఉందని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్నారు. కొందరు అధికారులు వచ్చే ఎన్నికల్లోపు తాము రిటైరైపోతామని, తర్వాత ఏం చేయగలరులే అని ధీమాగా ఉన్నారని, రిటైరైనా కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 

Updated Date - 2021-01-22T08:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising