ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీది అరాచక పాలన : టీడీపీ నేత వలవల బాబ్జి

ABN, First Publish Date - 2021-01-27T05:55:16+05:30

రాజ్యాంగంలో చట్టాలను ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ నేత వలవల బాబ్జి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, జనవరి, 26 : రాజ్యాంగంలో చట్టాలను ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ నేత వలవల బాబ్జి అన్నారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం పెంటపాడు గేటు సెంటర్‌ వద్ద డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వైసీపీ ప్రభుత్వం తన తీరును మార్చుకోవడం లేదంటూ విమర్శించారు. తాజాగా స్థానిక పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ దాసరి అప్పన్న, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కిలపర్తి వెంకట్రావు, మజ్జి సంగంనాయుడు,  నల్లమిల్లి చినగోపిరెడ్డి, దాసరి సతీశ్‌కుమార్‌, చీపుర్ల సాంబశివరావు, శెనగన శ్రీను, దాసరి సత్యనారాయణ, జామి జగన్నాథం, చల్లా చంద్రశేఖర్‌, కొండపల్లి చినశ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising