ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ABN, First Publish Date - 2021-10-23T04:35:55+05:30

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి, చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు.

కొవ్వూరులో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎంపీ భరత్‌రామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, అక్టోబరు 22: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి, చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌లో జనాగ్రహ దీక్షలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, ముదునూరి నాగరాజు, పామెర్ల నగేష్‌, ముళ్ళపూడి కాశీ, కంఠమణి రమేష్‌బాబు, అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, తోట రామకృష్ణ, రుత్తల భాస్కరరావు, వైస్‌ చైర్మన్‌లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, మారిన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


టి.నరసాపురం: చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌లో జడ్పీటీసీ సామంతపూడి బాలసూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జనాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని హితవు పలికారు. శ్రీనురాజు, సర్పంచ్‌లు తడికలపూడి శివమాధవి, మోదు గు సునంద, వైఎస్‌ ఎంపీపీ బొర్ల దివ్యభారతి, దాసరి రాంబాబు, దాకారపు సూరిబాబు, దేవరపల్లి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising