ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాన్‌ కింద హీట్‌

ABN, First Publish Date - 2021-03-02T05:28:56+05:30

ఆ ఇద్దరు బాబులు మంచి మిత్రులు ఒక బాబు సేవా సంస్థకు వెన్నెముక అయితే మరో బాబు రాజకీయమే ఆరోప్రాణంగా తిరుగుతున్న వ్యక్తి పదవీ కాంక్ష ఎవరిమధ్య అయినా చిచ్చు పెడుతుంది అనేందుకు ఈ ఇద్దరు బాబులే ఉదాహరణ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికార పార్టీలో చైర్మన్‌ అభ్యర్థిత్వానికి అసమ్మతిరాగం

ఒకప్పుడు మిత్రులు ఇప్పుడు ఎడముఖం పెడముఖం 8 అధిష్ఠానం మొగ్గు ఎటువైపో ?

ఆ ఇద్దరు బాబులు మంచి మిత్రులు ఒక బాబు సేవా సంస్థకు వెన్నెముక అయితే మరో బాబు రాజకీయమే ఆరోప్రాణంగా తిరుగుతున్న  వ్యక్తి పదవీ కాంక్ష ఎవరిమధ్య అయినా చిచ్చు పెడుతుంది అనేందుకు ఈ ఇద్దరు బాబులే ఉదాహరణ. నిన్న మొన్నటి వరకు ఎన్నో ఏళ్ల  స్నేహం. మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే సరికి ఇద్దరు మిత్రులు కాస్త ఎడముఖం, పెడముఖం అయ్యారు. ఈ ఇద్దరి బాబుల మధ్య మున్సిపల్‌  చైర్మన్‌ అభ్యర్థిత్వం తెచ్చిన  తంటా ఇది. ఈ ఇద్దరి కారణంగా ఫ్యాన్‌ కింద వేడి గాలులు వీస్తున్నాయి.           

నిడదవోలు పట్టణానికి చెందిన ఓ బాబు మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న వ్యక్తి. ఇదే పట్టణానికి చెందిన మరో బాబు ఒక సేవా సంస్థకు వెన్నెముక. అంతకు మించి వీరిద్దరి మధ్య ఏళ్ల తరబడి స్నేహం కొనసాగుతోంది. ఇది పట్టణ ప్రజలందరికి తెలిసిన సత్యం. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్‌ సీటు ఓసీ జనరల్‌కు కేటాయించడమే. మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఓ బాబు వైసీపీలోనే ఉన్నారు. పార్టీ తరపున చైర్మన్‌ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధినాయకులకు మొరపెట్టుకున్నారు. అప్పటి వరకు సేవా రంగంలో ఉంటూ రాజకీయాలంటే తనకు పడవంటూ దూరంగా ఉండే మరో బాబు కూడా చైర్మన్‌ అభ్యర్థిత్వంపై దృష్టి సారించారు. దీంతో వీరిద్దరు మిత్రులు కాస్తా ఎడముఖం పెడముఖం అయ్యారు. మరోవైపు ఇటీవలే పార్టీలోకి వచ్చిన మరోబాబుకు చైర్మన్‌ అభ్యర్థిత్వంపై ఆశపడడంపై పార్టీలోని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో ఫ్యాను కింద వేడి గాలులు మొదలయ్యాయి. పార్టీ నాయకత్వం ఈ ఇద్దరి బాబులను కౌన్సిలర్‌ అభ్యర్థులుగా గెలిచిన వచ్చిన తరువాత చూద్దామంటూ కౌన్సిల్‌ బరిలోకి దించింది. దీంతో వైసీపీలో రాజకీయం వేడెక్కింది.

Updated Date - 2021-03-02T05:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising