ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంని విమర్శిస్తే ఊరుకోం : వైసీపీ

ABN, First Publish Date - 2021-10-21T05:22:33+05:30

సీఎం జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులకు లేదని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

భీమవరంలో చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలతో వైసీపీ నాయకుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం/అర్బన్‌/ఉండి/వీరవాసరం/ఆచంట/కాళ్ళ/పోడూరు/పాలకొల్లుఅర్బన్‌/ ఆకివీడు,అక్టోబరు 20 : సీఎం జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులకు లేదని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హెచ్చరించారు.సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పా లని జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు  వెనక ఉండే పట్టాభి, నాయకులు చేత జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. సీఎంకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి పట్టాభి, అయ్యన్న పాత్రుడు,బుద్దా వెంకన్న తదితర నాయకులు తయారయ్యా రని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి అన్నారు. వైసీపీ నాయకులు భీమ వరం ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను ఊరేగించి దేహశుద్ధి చేశారు. ఉండి పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన ప్రదర్శన చేసి ఎస్‌ఐకి వినతి పత్రం అందించారు. వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌, ఆచంట కచేరి సెంటర్‌లో వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. కాళ్ళ గ్రామంలో వైసీపీ నేతలు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. పోడూ రు మండలం కవిటం సెంటర్‌లో వైసీపీ నాయకులు రాస్తారోకో చేశారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో బుధవారం వైసీపీ నాయకులతో కలిసి చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేయాలంటూ  ఆకివీడు వైఎస్‌ఆర్‌ సెంటర్‌లో నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరిచర్ల విజయనరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, కామన నాగేశ్వరరావు, గుళిపల్లి అచ్చారావు, ఎంపీపీ హరిబాబు, సర్పంచ్‌ కమతం సౌజన్య బెనర్జి,  గూ డూరి ఓంకార్‌, చికిలే మంగతాయారు, ఎస్‌.శ్యాంబాబు,ఏఎంసీ చైర్మన్‌  సుంకర ఇందిరా సీతారాం, మండల వైసీపీ అధ్యక్షురాలు మామిడిశెట్టి కృష్ణవేణి, వైట్ల కిషోర్‌, జడ్పీటీసీ గుంటూరి పెద్ది రాజు, ఎంపీపీ సబ్బితి సుమంగళి, వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు, యడ్ల తాతాజీ, మేకా శేషుబాబు, చం దక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising