ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు దీక్ష సిగ్గు చేటు : మంత్రి రంగరాజు

ABN, First Publish Date - 2021-10-22T05:16:41+05:30

వైసీపీ నాయకులు దీక్షకు దిగారు.

భీమవరం దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మోషేన్‌ రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట/భీమవరం/ఆకివీడు/నరసాపురం టౌన్‌/పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 21 : వైసీపీ నాయకులు దీక్షకు దిగారు. పెనుమంట్ర మండలం మార్టేరు, భీమ వరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆకివీడు వైఎస్‌ఆర్‌ సెంటర్‌, నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌, పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌ గురువారం జనాగ్రహదీక్షలను ప్రారంభించారు. మార్టేరులో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ  టీడీపీ నేత పట్టాభికి మద్దతుగా చంద్రబాబు నాయుడు దీక్షచేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అండతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేశారన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు, పవన్‌లు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆరోపించారు.   తమ రాజకీయ భవిష్యత్‌ కనుమరుగవుతుందని భయపడి చంద్రబాబు కుట్ర లు కుతంత్రాలు చేస్తున్నారన్నారు.ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు చంద్ర బాబు దీక్ష హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్‌ను ఎవరేమన్నా ఊరుకోమని నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు హెచ్చరించారు. చంద్రబాబు సీఎం జగన్‌కు క్షమాపణలు చెప్పాలని జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశా రు.నరసాపురంలో చైర్‌పర్సన్‌ వెంకటరమణ, వీసీ నాగిని, కౌన్సిలర్లు దీక్షకు దిగారు. సాయంత్రం దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సందర్శించి నిమ్మరసం అందించారు.ఈ  కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, కామన నాగేశ్వరరావు, ఏఏంసీ చైర్మన్‌ నర్సయ్య,యడ్లతాతాజీ, మేకా శేషుబాబు, కర్రా జయసరిత పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising