ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెంలో ఎక్కడి చెత్త అక్కడే..

ABN, First Publish Date - 2021-04-16T06:24:14+05:30

జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు.

మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ కౌన్సిలర్ల మండిపాటు



జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 15 : జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ సమా వేశం చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కౌన్సిలర్లు ముప్పిడి అంజి, మేడవరపు లక్ష్మీజ్యోతి, కరుటూరి రమాదేవి, ము ప్పాని రమణ, వలవల తాతాజీ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడి చెత్త అక్క డే ఉంటుందన్నారు. చెత్తకుప్పలను తరలించడంలో తీవ్ర జాప్యం నెలకొం టుందని మండిపడ్డారు. 29వ వార్డు లోకేశ్‌ నగర్‌లో తాగునీటికోసం ఇబ్బం దులు పడుతున్నారని, ప్రత్యేక బోరు బావి ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్‌ సాధారణ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలన్నారు. ముప్పిడి అంజి మాట్లాడుతూ పట్టణ ప్రణాళికా విభాగం సేవలు పారదర్శ కంగా లేవన్నారు. నిర్మాణాలకు అనుమతిలో ఇంజనీర్లు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. రోడ్డు నిర్మాణాల్లో జాప్యం జరుగుతుంద న్నారు. సమావేశంలో ప్రవేశపెట్టిన ఆరు అంశాలపై చర్చించి ఆమోదం తెలి పారు. కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ సభ్యులు తెలియజేసిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కరి స్తామన్నారు. ఏఈ పి.సాయి, సంధ్య, ఆర్‌ఐ సాకేత్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising