ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓజోన్‌ పొరను రక్షిద్దాం

ABN, First Publish Date - 2021-09-17T05:35:21+05:30

ఓజోన్‌ పొర దెబ్బతిని వాతావరణం అస్తవ్యస్తంగా ఉందని, ఓజోన్‌ పొర రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉం దని సీఎస్‌ఎన్‌ కళాశాల వ్యవస్థాపకుడు డాక్టర్‌ చీడే సత్యనారాయణ అన్నారు.

భీమవరం సీఎస్‌ఎన్‌ కళాశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ప్రతిజ్ఞలు


భీమవరం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 16 : ఓజోన్‌ పొర దెబ్బతిని వాతావరణం అస్తవ్యస్తంగా ఉందని, ఓజోన్‌ పొర రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉం దని సీఎస్‌ఎన్‌ కళాశాల వ్యవస్థాపకుడు డాక్టర్‌ చీడే సత్యనారాయణ అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం సీఎస్‌ఎన్‌ కళాశాలలో అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.సత్యనారాయణ, నిర్వాహుకుడు చెరుకువాడ రంగసాయి మాట్లా డారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి, గొడుగులు, గ్లోబ్‌లతో ర్యాలీ నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, పర్యావరణ శాస్త్రవేత్త మట్లపూడి సత్యనారాయణ, బొమ్మదేవర ప్రభాకర్‌, గెడ్డం భాస్కరరావు, పాల్గొన్నారు.

బీజీబీఎస్‌ కళాశాలలో..

నరసాపురం టౌన్‌, సెప్టెంబరు 16 : ప్రకృతిని రక్షిస్తే... అది మన జీవన విధానాన్ని, ఆరోగ్యానికి కాపాడుతుందని బీజీబీఎస్‌ కళాశాల కరస్పాండెంట్‌ నూలి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం అంతర్జాతీయ ఓజోన్‌ పొర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రాధ మాట్లాడారు. రిటైర్ట్‌ ప్రిన్సిపాల్‌ అమ్మాజీ, అధ్యాపకులు మధుషాలిని, నీరజ, ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising