ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల భారంతో మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-14T05:13:26+05:30

అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో ఒక మహిళ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకునికి ఆత్మహత్యకు పాల్పడింది.

జయలక్ష్మి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 13 : అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో ఒక మహిళ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకునికి ఆత్మహత్యకు పాల్పడింది. బీడీ కాలనీకి చెందిన కుంపాల జయలక్ష్మి (34)కు భర్త నూ కరాజు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఆటో డ్రైవ ర్‌గా జీవిస్తున్నాడు. జయలక్ష్మి ఇళ్లలో పనులు చేస్తుంది. సొంతిల్లు కట్టుకోవాలని ఆశ పడింది. నాలుగు ఇళ్లలో పనిచేయడంతో అందరితో కలిసిమెలసి ఆప్యాయతగా ఉండేది.  సొంతిల్లు కట్టాలని ఆశతో రెండేళ్ల క్రితం 18 మంది వద్ద రూ.15 లక్షల వరకూ అప్పు చేసింది. అంత సొమ్ము అప్పు వద్దని ఆమె భర్త వాదించినప్పటికీ ఏదో విధంగా సొంత ఇల్లు ఉంటే అప్పు అదే తీరుతుందనే ధైర్యంతో ఆమె అప్పులు తెచ్చింది. వాటికి వడ్డీలు కట్టలేక సతమతమయ్యారు. ప్రస్తుతం అప్పులు ఇచ్చిన వారిలో కొంతమందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. వారు సొంత ఇల్లు నిర్మించుకునే ప్రయత్నాల్లో  జయలక్ష్మిని సొమ్ము వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. వడ్డీ లేకపోయినా అసలు ఇచ్చేయాలని వారు ఒత్తిడి చేయడంతో ఆ సొమ్ములు పది లక్షల వరకూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు చెప్పడంతో తమ వద్ద ఆటో తప్ప ఇంకేమీ లేదని గతంలోనే ఇంత అప్పు పెట్టి ఇల్లు కట్టవద్దని చెప్పానని తాను ఏమీ చేయలేనని చెప్పేశాడు. దీంతో ఆమె అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. ఆమె ఇంకా  రావడంలేదని గమనించిన భర్త చూసేటప్పటికి ఫ్యాన్‌కు కొట్టుమిట్టాడుతుండంతో తమ పిల్లలు, ఆ తండ్రి కలిసి వెంటనే ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిం దని వైద్యులు నిర్ధారిం చారు. వైద్యులు ఎమ్మె ల్సీగా నమోదు చేసి ఔట్‌పోస్టు పోలీసు లకు సమాచారం ఇచ్చారు.  రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌ సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-14T05:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising