ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఎవరో..?

ABN, First Publish Date - 2021-03-03T05:47:21+05:30

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకటించని ప్రధాన పార్టీలు


నరసాపురం, మార్చి 2: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగుస్తోంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థులను మాత్రం ప్రధాన పార్టీలు ఇంకా ప్రకటిం చలేదు. దీంతో పలు పేర్లు షికారు చేస్తున్నాయి. ఎక్కువగా అధికార పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తెరపైకి కొత్త పేర్లు వినిపి స్తుండడంతో పార్టీలోనే గందరగోళం నెలకొంది. ఈసారి రిజర్వేషన్‌లో బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కామన బుజ్జి సతీ మణి నాగిని, బర్రె లీలా, షేక్‌ యాకోబ్‌బీబీ, మాజీ జడ్పీటీసీ బర్రె వెంకట రమణ పేర్లు వినిపించాయి. కొత్తగా మరోపేరు వెలుగులోకి రావడంతో అధికారంలోకి వస్తే ఎవరిని కుర్చీలో కూర్చోబెడతారన్నది అధికార పార్టీలో చర్చనీయాంశమైంది.


టీడీపీలో ఇంతవరకు అభ్యర్ధి ఎవరన్నది తెలియరాలేదు. నామినేషన్ల సమయంలో అధికార పార్టీకి ఏకగ్రీవం కాకుండా చూసేందుకు హడావుడిగా అభ్యర్థులను బరిలో నిలిపారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ అవగాహనతో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడంతో అదే జోరు మున్సిపల్‌ ఎన్నికల్లో ఉంటున్న ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు. వారితో అవగాహనతో ఇప్పటి వరకు 25 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుంది. జనసేన 6 వార్డుల్లో బరిలో నిలవనుంది. ఇంకా సీట్లు కేటాయింపు ఒక కొలిక్కిరాలేదు. కానీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిపై మాత్రం ఇంకా స్వష్టత వీడలేదు.

Updated Date - 2021-03-03T05:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising