ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తింపు

ABN, First Publish Date - 2021-05-22T04:59:26+05:30

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఆందోళన కలిగి స్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆసుపత్రులకు నలుగురి తరలింపు

తాడేపల్లిగూడెం రూరల్‌/ పాలకొల్లు రూరల్‌/అత్తిలి, మే 21: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఆందోళన కలిగి స్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు భయపెడు తుండగా దీనికి బ్లాక్‌ ఫంగస్‌ తోడైంది. తాడేపల్లిగూడెం మండలం పడాలకు చెందిన తంతినాడ సత్యనారాయణ లారీ క్లీనర్‌గా పనిచేస్తుం టాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌ రాగా క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ మూడు రోజులుండి ఇంటికి వచ్చారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్న సత్య నారాయణకు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో స్థానిక వైద్యులకు చూపిస్తే బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించారు. దీంతో స్థానిక ప్రభుత్వ వైద్యులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గన్నపేటకు చెందిన బుల్లయ్యకు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స తరువాత బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సంప్రదిస్తే బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించారు. వెం టనే వైద్యులు బుల్లయ్యను కాకినాడ ఆసుపత్రికి తరలిం చారు. పాలకొల్లు మండలం తిల్లపూడికి చెందిన బి.ఏసు రత్నం అనే 50 ఏళ్ళ వ్యక్తి బ్లాక్‌ఫంగస్‌ వ్యాధికి గుర య్యాడు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగా గుర్తించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు.  అత్తిలిలో బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మోపిదేవి వీరేశ్వరరావును చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలకు తరలించామని పీహెచ్‌సీ వైద్యాధికారిణి ప్రసన్నకుమారి తెలిపారు. 

Updated Date - 2021-05-22T04:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising