ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రుల్లో అందని సాధారణ వైద్య సేవలు

ABN, First Publish Date - 2021-06-22T04:56:58+05:30

కరోనా కాలంలో ప్రభుత్వ పరంగా సాధారణ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లడిల్లుతున్న బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు

ఏలూరు క్రైం, జూన్‌  21 : కరోనా కాలంలో ప్రభుత్వ పరంగా సాధారణ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో కరోనా వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ వైద్య సేవలు ఆ ఆస్ప త్రుల్లో తూతూ మంత్రంగానే సాగిస్తున్నారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నామంటూ  వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమై ఏప్రిల్‌, మేలో విజృంభించింది. ఏప్రిల్‌ నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఎన్‌సీడీ విభాగాన్ని షుగరు, బీపీ వ్యాధి గ్రస్తుల కోసం  ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. వందలాది మంది నిత్యం ఈ విభాగానికి వచ్చి తమ బీపీ, షుగరు చెక్‌ చేయించుకుని 15 రోజులకు సరిపడా మందు లను తీసుకువెళ్తుంటారు. ఏప్రిల్‌ నెల నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ వైద్య సేవలతో పాటు ఎన్‌సీడీ విభాగాన్ని మూసివేయడంతో షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులు ప్రైవేటు వైద్యం చేయించుకోవడా నికి తల్లడిల్లిపోతున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 450 పడకలు ఉండగా, 300 పడకలను కొవిడ్‌కు కేటాయించగా, వంద పడకలు గర్భిణులకు, 50 పడకలకు చిన్న పిల్లల వైద్య విభాగానికి ఉంచారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో  సోమవారం కేవలం ముగ్గురు కరోనా బాధితులు చేరగా ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న వారి సంఖ్య 173కు చేరింది. ఆస్పత్రిలో చేరే బాధితుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్నప్పటికీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు కనీసం  ఓపీ విభా గాన్ని ఏర్పాటు చేసి నెలకు సరిపడ మందులను ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ పలువురు  కోరుతు న్నారు.

Updated Date - 2021-06-22T04:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising