ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావను కత్తితో నరికేశాడు...

ABN, First Publish Date - 2021-05-21T03:57:44+05:30

అక్కను పెట్టే హింసను భరించలేక బావనే కత్తితో నరికి హత్యచేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలూరు క్రైం, మే 20 : అక్కను పెట్టే హింసను భరించలేక బావనే కత్తితో నరికి హత్యచేశాడు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ నాగేంద్ర కాలనీలో నక్కలోళ్ళ వీధికి చెందిన ఎల్లమ్మ (30)కు విజయవాడకు చెందిన పవర రాజుతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పవర రాజు(37) పూసల కోసం తరచుగా తమిళనాడు వెళ్ళి కొనుగోలు చేసి వచ్చేవాడు. అక్కడ ఆ సమయంలో నందిని అనే యువతితో పరిచయం ఏర్పడి ఆమెను రెండవ భార్యగా అక్కడే ఉంచి ఉంటున్నాడు. నెలకి ఒకటి రెండుసార్లు ఎల్లమ్మ వద్దకు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్తూండేవాడు. వచ్చినప్పుడల్లా ఆమెను అనుమానంతో కొడుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. దీనిని ఆమె సోదరుడు దాబి బంగారం (27) ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. బంగారం కత్తిని తీసుకుని రాజు తలపై నరకడంతో రాజు మృతి చెందాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-21T03:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising