ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచిన వాన

ABN, First Publish Date - 2021-07-24T05:55:26+05:30

మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కడిమికుంట సమీపంలో నీటమునిగిన నారుమడులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటిముంపులో వరిచేలు

నిండా మునిగిన రైతులు

పెదపాడు/ దెందులూరు/ పెదవేగి, జూలై 23 : మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద పాడు మండలంలో వరినాట్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాక పోయినా నారు మడులు నీటమునిగాయి. వర్షపునీరు ఎక్కువ రోజులు నిలిచి ఉంటే నారు కుళ్లి పోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ప్రభావంతో మురుగు డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెదపాడు– వట్లూరు రహ దారిలోని కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోయాయి. దెందులూరు మండలంలోని పోతునూరు, కొవ్వలి, దోసపాడు, కేతవరం గ్రామాల పరిధిలో వరిపొలాలు, నారుమళ్లు నీటితో పూర్తిగా మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పెదవేగి మండలంలోని భోగాపురం, అమ్మపాలెం, కొప్పాక, పెదకడిమి, అంకన్నగూడెం, బి.సింగవరం తదితర గ్రామాల్లో వరిచేలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.   వర్షాలకు తమ్మిలేరుకు వరదనీరు పోటెత్తి విజయరాయి– బలివే మధ్య రహదారి కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిన రహదారిని ఎంపీడీవో ఎం.బలరామరాజు శుక్రవారం పరిశీలించారు. జగనన్న కాలనీలకు ఉచిత ఇసుకను సరఫరా చేయడానికి నిర్దేశించిన ఇసుక ర్యాంపులు ముంపులో ఉన్నాయని, లబ్ధిదారులు వరద తగ్గే వరకు తమ్మిలేరుకు రావద్దని సూచించారు. ఆయన వెంట గ్రామ వీఆర్వో రామచంద్రరావు, కార్యదర్శులు ప్రసాద్‌, కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-24T05:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising