ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ప్రయాణికులకు దర్శనం టిక్కెట్‌

ABN, First Publish Date - 2021-02-28T05:16:53+05:30

జిల్లా నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం టిక్కెట్‌తో పాటుగా 300 రూపాయల దర్శనం టికెట్‌ కూడా ఇస్తామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాసరావు (ఏలూరు) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి నెలాఖరు వరకు 

అన్ని ఏసీ బస్సులకు 10 శాతం రాయితీ

జిల్లాలో రెండు డ్రైవింగ్‌ స్కూల్స్‌

త్వరలో ఆర్టీసీ పెట్రోలు బంకులు

ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు 

భీమవరం క్రైం, ఫిబ్రవరి 27 :  జిల్లా నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం టిక్కెట్‌తో పాటుగా 300 రూపాయల దర్శనం టికెట్‌ కూడా ఇస్తామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాసరావు (ఏలూరు) తెలిపారు. శనివారం భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఏలూరు, భీమవరం పట్టణాల్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామని, తద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కోసం 23,600 రూపాయలు చెల్లిచాలని అన్నారు. ఏలూరు డీపో ఆధ్వర్యంలో సి.ఎమ్‌.ఆర్‌ ఎదురుగా ఉన్న 850 గజాల స్థలంలో రెండు నెలల్లో పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభిస్తామన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం డిపోల ఆధ్వర్యంలో కూడా త్వరలో బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి నెలలో అధిక ఆదాయం ఆర్టీసీకి వచ్చిందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి అన్ని రూట్లులో బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రతి ఏసీ ఆర్టీసీ బస్సుల్లో 10శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. మార్చి నెల ఆఖరు వరకు ఈ రాయితీ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భీమవరం డిపో మేనేజర్‌ మహేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T05:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising