ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయరాయిలో టీడీపీ రాస్తారోకో

ABN, First Publish Date - 2021-09-19T05:31:58+05:30

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీలను తక్షణం అరెస్టు చేసి, శిక్షించాలని పేర్కొంటూ విజయరాయిలో టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

విజయరాయిలో రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, సెప్టెంబరు 18 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీలను తక్షణం అరెస్టు చేసి, శిక్షించాలని పేర్కొంటూ విజయరాయిలో టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ.రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి, జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న నాయకుడి ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడికి పాల్పడడం శోచనీయమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, రెండేళ్లలోనే రాష్ట్రం అప్పుల ఊబీలోకి కూరుకుపోయిందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన జోగి రమేష్‌, ఇతర వైసీపీ నాయకులను తక్షణం అరెస్టు చేయాలని సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావిపాటి పిచ్చియ్యచౌదరి, ఈడ్పుగంటి సుందరయ్య, పెదర్ల నానీ, బిర్లంగి పెద్దులు తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు ఇంటిపై దాడి హేయమైన చర్య 

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 18 : మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్‌ వారి అనుచరులు దాడికి తెగబడడం హేయమైన చర్య అని ఏలూరు రూరల్‌ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు, మాజీ అధ్యక్షుడు నేతల రవి, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాల రావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసేలా ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచరులను తీసు కుని చంద్రబాబు ఇంటిని చుట్టు ముట్టడం దిగజారుడుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడడం వారి అనాగరిక చర్య అన్నారు. తక్షణమే టీడీపీ స్పందించి జోగి రమేష్‌తో పాటు ఆయ న అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-09-19T05:31:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising