ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మృతులకు రూ.10 లక్షలివ్వాలి

ABN, First Publish Date - 2021-06-19T04:41:20+05:30

రాష్ట్రం లో కొవిడ్‌ బారిన పడిన ప్రతి పేదవాడికి రూ.10 వేల ఆర్థిక సాయంతోపాటు మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.

నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం  

రెవెన్యూ సబ్‌ డివిజన్‌ కార్యాలయాల వద్ద టీడీపీ ఆందోళన

నరసాపురం/కొవ్వూరు/ఏలూరు కలెక్టరేట్‌/జంగారెడ్డిగూడెం, జూన్‌ 18 : రాష్ట్రం లో కొవిడ్‌ బారిన పడిన ప్రతి పేదవాడికి రూ.10 వేల ఆర్థిక సాయంతోపాటు మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. తెలుగుదేశం అధినాయకత్వం పిలుపు మేరకు శుక్రవారం ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ కార్యాల యాల వద్ద పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాల యం వద్ద జరిగిన ధర్నాలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానా యుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం చంద్రన్న బీమాను కొనసాగిం చకపోవడం వల్లే కొవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం దక్కని పరిస్థితి నెలకొందన్నారు. ఆక్సిజన్‌ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాల న్నారు. దహన సంస్కారాలకు రూ.15 వేలు, రైతులకు ధాన్యం సొమ్ము తక్షణం వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి రామరాజు, నాయకులు పాలూరి బాబ్జీ, కొప్పాడ రవి, గుబ్బల నాగరాజు పాల్గొన్నారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో విఫలమైన సీఎం జగన్మోహనరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు ఆర్డీవో కార్యాల యం వద్ద జరిగిన నిరసనలో టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాథాకృష్ణయ్య (చంటి).. ఆర్డీవో పనబాక రచనకు వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2021-06-19T04:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising