ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జై శ్రీరామ..

ABN, First Publish Date - 2021-04-21T05:28:37+05:30

జిల్లాలో ప్రతీ ఏటా శ్రీరామ నవమి వేడుకలను అత్యంతానందోత్సాహాలతో ని ర్వహించేవారు.

మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో అమ్మకానికి ఉంచిన విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరోనా ప్రభావం ఉన్నా ఆగని నవమి  సందడి

సీతారాముల విగ్రహాలు జోరుగా అమ్మకాలు

ఏలూరులో కిక్కిరిసిన మార్కెట్‌

నేడు పలుచోట్ల సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు


ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 20: జిల్లాలో ప్రతీ ఏటా శ్రీరామ నవమి వేడుకలను అత్యంతానందోత్సాహాలతో ని ర్వహించేవారు. గతేడాది కరోనా విజృంభించడం కారణం గా శ్రీరామనవమి పందిళ్లు తక్కువగానే వెలిశాయి. ఉత్స వాలను రద్దు చేసి శ్రీరామనవమి రోజున కొవిడ్‌ నిబంధ నలు పాటిస్తూ అతి తక్కువ మంది భక్తులతో కల్యాణా న్ని నిర్వహించారు. ఈసారి కూడా శ్రీరామనవమి వేడుక లకు కరోనా అడ్డంకిగా మారింది. దీంతో కేవలం కల్యాణో త్సవాన్ని ఆలయానికే పరిమితం చేయాలని, భక్తుల సం ఖ్య తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ముందస్తుగానే హెచ్చ రికలు జారీ అయ్యాయి. అయినా భక్తులు జిల్లాలోని పలు ప్రాంతాలలో నవమి పందిళ్లు వేసి కల్యాణోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. రామ మందిరాలలోనే కాకుండా పలు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.  

కిక్కిరిసిన విగ్రహాల మార్కెట్‌ 

శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి సీతారాయ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఏలూరు నగరంలో సీతారాముల విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఏలూరులోని మునిసిపల్‌ కార్యాలయం సమీ పంలో ఈ విగ్రహాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో రూపొందించిన వివిధ ఆకృతులు కలిగిన సీతారాముల విగ్రహాలను ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు. 1000 రూపాయల నుంచి 2 వేల రూపా యల వరకు ఈ విగ్రహాలను అమ్ముతున్నారు. వివిధ రూపాలలో ఆకర్ష నీయంగా కళాకారులు విగ్రహాలను రూపొందించారు. ఏలూరులోని పరిసర ప్రాంతాల ప్రజ లే కాకుండా, జిల్లా లోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసి ఊరేగిం పుగా తీసుకెళ్లారు.

  నవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు

పెదపాడు, ఏప్రిల్‌ 20: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనమవి వేడుకల కోసం మండలంలోని రామాలయాలు అందంగా ము స్తాబయ్యాయి. పెదపాడులోని తెలగాలపేట, మారుతీ దేవాలయం, అప్పన వీడులోని అభయాంజనేయస్వామి దేవాలయంలతో పాటు పలు దేవాలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  

Updated Date - 2021-04-21T05:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising