ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు సత్వర సేవలందించాలి

ABN, First Publish Date - 2021-07-30T05:04:20+05:30

పోలీసు అధికారులు నిత్యం అప్ర మత్తంగా.. అవినీతిరహితంగా ఉంటూ ప్రజలకు సత్వర సేవలందించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌  

ఏలూరు క్రైం, జూలై 29 : పోలీసు అధికారులు నిత్యం అప్ర మత్తంగా.. అవినీతిరహితంగా ఉంటూ ప్రజలకు సత్వర సేవలందించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు. గురువారం ఏలూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మద్యం అక్రమ రవా ణాను అరికట్టాలని, ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఖైనీల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామాన్ని పోలీసు అధికారులు సందర్శించి సమస్యలను తెలుసు కుని చిన్న చిన్న సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీలు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కొండలరావు, బీసీఆర్‌బీ సీఐ ప్రసాదరావు, పోలీసు న్యాయ సలహాదారుడు కె.గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising