ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఇసుక పాలసీ అమలుకు చర్యలు

ABN, First Publish Date - 2021-05-14T05:37:23+05:30

కొత్త ఇసుక పాలసీని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, మే 13(ఆంధ్రజ్యోతి): కొత్త ఇసుక పాలసీని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. సచివాలయం నుంచి పంచాయతీరాజ్‌, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జాయింట్‌ కలెక్టర్లతో గురువారం నిర్వహిచిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 27 ఓపెన్‌ రీచ్‌లు ఉన్నాయని, వీటిలో 9 వినియోగంలో ఉన్నాయని తెలిపారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు, పెరవలి మండలం కండవల్లి–1, కుసులముర్రు, కండవల్లి– 2, పెనుగొండ మండలం సిద్ధాంతం, నిడదవోలు మండలం పెండ్యాల కనురు– 1, పెండ్యాల– 3 ఉన్నాయని చెప్పారు. ఇవికాక 21 కొత్త రీచ్‌లను గుర్తించడం జరిగింది. అవసరమైన అనుమతులకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 18 వెయింగ్‌ మిషన్స్‌, 68 సీసీ కెమేరాలు, 2,404 జీపీఎస్‌, ఇంటర్నెట్‌ సౌకర్యంతో అందుబాటులో ఉన్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ గనుల శాఖ సహాయ సంచాలకులు కే. శ్రీనివాసరావు, ఏజెన్సీ జిల్లా ప్రతినధి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T05:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising