ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిగాపులు

ABN, First Publish Date - 2021-07-24T05:54:03+05:30

ప్రభుత్వం ఎన్ని విధానాలు అమలు చేస్తున్నా రేషన్‌ సరుకుల కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

రేషన్‌ కోసం పడిగాపులు కాస్తున్న కార్డుదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రేషన్‌ డిపోలో సర్వర్‌ సమస్య

 ఉచిత బియ్యం కోసం లబ్ధిదారుల పాట్లు 

ఏలూరు రూరల్‌, జూలై 23 : ప్రభుత్వం ఎన్ని విధానాలు అమలు చేస్తున్నా రేషన్‌ సరుకుల కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. ఈనెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే బి య్యాన్ని వాహనాల ద్వారా వలంటీర్లు పంపిణీ చేశారు. కేంద్రం ఇచ్చే  బియ్యా న్ని మాత్రం డిపోల్లో తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీలర్లు ఈనెల 20 నుంచి బియ్యం పంపిణీ  ప్రారంభించారు. అయితే సర్వర్‌ సమస్య కారణంగా బియ్యం పంపిణీ సక్రమంగా సాగడం లేదు. మూడు రోజులుగా లబ్ధిదారులు డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక సమస్య పరి ష్కారం కాకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. మండలంలో 80 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. డిపోల వద్ద రెవెన్యూ అధికారుల పర్య వేక్షణ లో సరుకుల పంపిణీ ప్రారంభించారు. సాంకేతిక సమస్య కారణంగా లబ్ధిదారు లు బయోమెట్రిక్‌ వేసినప్పుడు సర్వర్‌ సతాయిస్తోంది. దీంతో అటు అధికారులు, ఇటు డీలర్లు లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు. రేషన్‌ సరుకుల కోసం రోజూ డిపోల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నామని లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ బియ్యాన్ని కూడా ఇంటి వద్దకే పంపితే సర్వర్‌ సమస్య తలె త్తినా వేచి ఉండడానికి ఇబ్బంది ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సర్వర్‌ సమస్య పరిష్కరించి సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. సర్వర్‌ సమస్యతో శుక్రవారం ఐదుశాతం కూడా పంపిణీ జరగలేదు. శనివారం లోగా సర్వర్‌ సమస్య పరిష్కారం కాకుంటే ఈనెల 26న కలెక్టరేట్‌ వద్ద ఆందోళ నలు చేస్తామని డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ప్రకటించారు.  

Updated Date - 2021-07-24T05:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising