ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలగిన ముంపు సమస్య

ABN, First Publish Date - 2021-06-24T05:01:04+05:30

మండలంలోని రామిలేరు, పెదపాడు మెయిన్‌ డ్రెయిన్ల పూడికతీత పనులను చేపట్టి ఆధునికీకరణ దిశగా డ్రెయిన్లను ప్రక్షాళన చేయడంతో ఆయా డ్రెయిన్ల కింద సాగులో ఉన్న రైతాం గం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనుల తర్వాత రామిలేరు మేజర్‌ ఇరిగేషన్‌ డ్రెయిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామిలేరు, పెదపాడు మెయిన్‌ డ్రెయిన్ల ప్రక్షాళన

ఆయకట్టు రైతుల హర్షం 

పెదపాడు, జూన్‌ 23 మండలంలోని రామిలేరు, పెదపాడు మెయిన్‌ డ్రెయిన్ల పూడికతీత పనులను చేపట్టి ఆధునికీకరణ దిశగా డ్రెయిన్లను ప్రక్షాళన చేయడంతో ఆయా డ్రెయిన్ల కింద సాగులో ఉన్న రైతాం గం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తోట గూడెం నుంచి గుడిపాడు మీదుగా కొల్లేరు వరకు సుమారు 10.1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రామిలేరు మేజరు ఇరిగేషన్‌ డ్రెయిన్‌ మొత్తం కిక్కిస, తూడు, ముళ్లచెట్లు, పొదలతో నిండిపోయి పైనుంచి వచ్చే వరదనీరు పారుదలకు సరైన మార్గం లేక డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న పం ట పొలాలు, సమీప గ్రామాలైన ఖాజీగూ డెం, చినసత్యవోలు, కడిమికుంట, గుడిపాడు ఎస్సీ కాలనీ నీటిమునిగిపోయేవి. దీంతో డ్రె యిన్ల ప్రక్షాళన కోసం ఆక్వా, రైతులతో పాటుగా స్థానికుల నుంచి డిమాండ్‌ రావడంతో ఆయా డ్రెయిన్ల పూడికతీత పనులను చేపట్టి ఇటీవల పూర్తి చేశారు. గతంలో డ్రెయిన్‌ పూడికతో నిండి పోవడంతో నీరుపారుదల సక్రమంగా జరిగేది కాదని, దీంతో కొల్లేరు గ్రామ సమీపంలోని చేపల చెరువులకు సాగునీటి సమస్య ఎదుర్కొవాల్సి వచ్చేదని, ఇప్పుడా సమస్య తీరిపోయిందని ఆక్వా రైతులు చెబు తున్నారు. ఇదేరీతిలో మండలంలోని మిగతా డ్రెయిన్లు, పంటబోదెల ఆధుని కీకరణ పనులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.


 ఆధునికీకరణతో ముంపు సమస్య తీరింది

 గతంలో చిన్నపాటి వర్షాలు, వరదలకు డ్రెయిన్ల వెంబడి గ్రామాలు, పంటపొలాలు ముంపు బారినపడేవి. ప్రభుత్వం డ్రెయిన్లను ఆధునికీకరించ డంతో ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కార మైనట్లయింది.  

– అక్కినేని రాజశేఖర్‌, ఏఎంసీ డైరెక్టర్‌

Updated Date - 2021-06-24T05:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising