మరో అల్పపీడనం.. అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ మిశ్రా
ABN, First Publish Date - 2021-11-16T06:03:36+05:30
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఈనెల 17, 18 తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఈనెల 17, 18 తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా వాయుగుండంగా మారి ఈనెల 18న మన రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. అందువల్ల ఈనెల 17,18 తేదీల్లో జిలాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలతో సహా మండలస్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వాలని ఆయన హెచ్చరించారు.
Updated Date - 2021-11-16T06:03:36+05:30 IST