ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులే ఆత్మీయులై..

ABN, First Publish Date - 2021-05-11T05:32:27+05:30

పోలీసులే ఆత్మీయుల య్యారు. తీవ్ర అనారోగ్యంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా అంతిమ సంస్కారానికి అయినవాళ్లు ఎవరూ రాలేదు.

కోడేరులో ఖననం చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరూ వున్నా అనాథలా..

రెండు మృతదేహాలకు అంత్యక్రియలు

దరిచేరని కుటుంబ సభ్యులు, బంధువులు

ఆచంట/పాలకొల్లు టౌన్‌, మే 10 : పోలీసులే ఆత్మీయుల య్యారు. తీవ్ర అనారోగ్యంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా అంతిమ సంస్కారానికి అయినవాళ్లు ఎవరూ రాలేదు. చివరకు పోలీసులే నడుం బిగించి దహన క్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు. ఆచంట, పాలకొల్లుల్లో జరిగిన ఈ ఘటనల వివరాలివి.. ఆచంట మండలం వల్లూరులో పెనుగొండ సత్యనారాయణ (60) అనే వ్యక్తి సోమవారం అనారోగ్యానికి గురవడంతో స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించ డంతో మెరుగైన వైద్యం నిమిత్తం అంబులెన్సు ద్వారా పాలకొల్లు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెంద డంతో అదే అంబులెన్సులో ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణకు పాజిటివ్‌ లేనప్పటికీ బంధువులు మాత్రం కరోనా తోనే మృతి చెందాడని భావించి, మృతదేహాన్ని కిందకు దించలేదు. మూడు గంటలపాటు ఎవరూ దగ్గరకు రాకపోవడంతో గ్రామస్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ మానవత్వం చాటుకుని సిబ్బందితో అదే అంబులెన్సులో మృతదేహాన్ని కోడేరు గోదావరి గట్టుకు తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. మృతుడికి భార్య రత్నకుమారి ఇక్కడే ఉంటుండగా, కుమార్తె, అల్లుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. పాలకొల్లు పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లోని వున్న షాపులో 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమా చారం అందించారు. సీఐ సీహెచ్‌ ఆంజనేయులు కరోనా ని బంధనలతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి, ఖన నం చేయించారు. మరణించిన వ్యక్తి ఎం.చినబాబు, అతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్టు స్థానికులు తెలిపారు. కొన్నిరోజులుగా తాను పనిచేసే షాపులోనే చినబా బు ఉంటున్నాడని సమాచారం. చినబాబు బంధువులు ఎవ రూ ముందుకు రాకపోవడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది, పారి శుధ్య కార్మికుల సహాయంతో ఖననం చేయించారు. 

Updated Date - 2021-05-11T05:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising