ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలిక్కి వచ్చిన ధాన్యం బకాయిలు

ABN, First Publish Date - 2021-01-26T05:37:41+05:30

ధాన్యం బకాయిలు కొలిక్కి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొనుగోలు చేసిన ఽధాన్యం 8,38,624 టన్నులు

ధాన్యం విలువ రూ.1,568 కోట్లు

రైతులకు చెల్లించింది రూ.1,293 కోట్లు

బకాయిలు రూ. 274 కోట్లు


ఏలూరు సిటీ, జనవరి 25 : ధాన్యం బకాయిలు కొలిక్కి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎక్కువ శాతంలో ఉన్న సార్వా ధాన్యం బకాయిలు ఇప్పుడు తగ్గాయి. గతంలో ధాన్యం కొను గోలు చేసిన 48 గంటల్లో రైతులకు ఽధాన్యం పేమెంట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే వి. ఇప్పుడు ధాన్యం సొమ్ములు చెల్లించడానికి 15 రోజులు గడువు విధించడంతో బకా యిలు పేరుకుపోయాయి. నిధుల కొరతో ఏమోగాని ఈసారి ధాన్యం కొను గోలు చేసినా సరియైున సమయానికి ధాన్యం సొమ్ములు చెల్లించలేకపోయారు. ఒక్కొక్క రైతుకు అయితే నెలరోజులు పైగా అయినా ధాన్యం సొమ్ములు చెల్లిం చని పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం అమ్మినా సొమ్ములు చెల్లించక పోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవా ల్సి వస్తోంది. ధాన్యం బకాయిలు చెల్లించాలని రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు ధాన్యం బకాయిలు చెల్లింపులు మొదలైంది.  

8,38,624 టన్నుల   ధాన్యం కొనుగోలు  

జిల్లాలో సార్వా ఽధాన్యం కొనుగోళ్లు 374 కేంద్రాల్లో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రూ.1568 కోట్లు విలువైన 8,38,624 టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 96,025 మంది రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశారు. 88,305 రైతులకు రూ.1,293 కోట్లు ధాన్యం సొమ్ములు చెల్లించారు. మిగిలిన బకాయిలు రూ.274 కోట్లు 7,720 మందికి చెల్లించాల్సి ఉంది. రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.190 కోట్లు అప్రూవల్‌ కావడంతో ఆ సొమ్ములు రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలో జమ కానున్నాయి.  

Updated Date - 2021-01-26T05:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising