ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలిన పటాస్‌

ABN, First Publish Date - 2021-09-17T05:27:23+05:30

వీరవాసరం మండలం రాయకుదురులో గురువారం రాత్రి ఒక ఇంట్లో బాణసంచాకు ఉపయో గించే పటాస్‌ పేలింది.

ధ్వంసమైన భవనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, సెప్టెంబరు 16: వీరవాసరం మండలం రాయకుదురులో గురువారం రాత్రి ఒక ఇంట్లో బాణసంచాకు ఉపయో గించే పటాస్‌ పేలింది. ఇళ్లల్లో అందరూ టీవీలు చూస్తుండగా ఒక్క సారిగా వినిపించిన పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిందేమో నని అనుకున్నారు. చివరకు ఒక భవనం గదిలో నిల్వ ఉంచిన పటాస్‌ పేలినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊరట చెందారు. రాయకుదురు బుదరాయుడు వీధి రామాలయం సమీపంలో బొరుసు సూర్యనారాయణ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తాకిడికి పటాస్‌ నిల్వచేసిన గది ధ్వంసమైంది. సమీపం లోని ద్వారా రామకృష్ణ భవనంతోపాటు పరిసర భవనాలు, ఇళ్లల్లోని గాజు వస్తువులు, తలుపులు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. సూర్యనారాయణ కుటుంబం ఎంతో కాలంగా తాటాకు టపాకాయలు తయారు చేసి అమ్ముతుంటారని చెబుతున్నారు. రాయకుదురుతోపాటు పరిసర గ్రామాల్లో రొయ్యలసాగు చేసే రైతులు చెరువులపై వాలే కొంగలు, కాకులను బెదిరించటానికి వీరి నుంచి ఈ బాణసంచా కొనుగోలు చేస్తుంటారు. దీపావళి సమీపించడం తో పటాస్‌ ధర పెరుగుతుందని భావించి ఇంటి మెట్ల కింద ప్రత్యేకంగా ఉన్న గదిలో సుమారు 10 కేజీల వరకూ నిల్వ చేశారు. పాలకొల్లు సీఐ వెంకటేశ్వరరావు, వీరవాసరం ఎస్‌ఐ పైడిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 


 



Updated Date - 2021-09-17T05:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising