ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై గళమెత్తారు

ABN, First Publish Date - 2021-08-03T05:42:24+05:30

వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వేర్వేరుగా ఆందోళనలు చేపట్టి వినతులు అందించారు.

నిరసన తెలుపుతున్న తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వేర్వేరుగా ఆందోళనలు చేపట్టి వినతులు అందించారు. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లో అవకాశం కల్పించాలని కొవిడ్‌–19 స్టాఫ్‌ అసోసియేషన్‌,  పర్మినెంట్‌ చేసి వేతనం పెంచాలంటూ  తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దంటూ ఇప్టూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లో అవకాశం కల్పించాలి 

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 2 : కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌లో వివిధ కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో, కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా పనిచేసిన సిబ్బంది ని వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌, యూపీ హెచ్‌సీ, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, గవర్న మెంటు ప్రభుత్వాస్పత్రుల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా కొవిడ్‌ – 19 స్టాఫ్‌ అసోసియేషన్‌ నాయకులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంత రం స్పందనలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకు లు మాట్లాడుతూ కొవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వర్తించామని, గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ జీతాలు చెల్లించలేదని దీంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారిందన్నారు. డీఎస్‌వీ రమణ, అనిల్‌రాజు, రవికుమార్‌, మణికంఠ, రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.  


 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయండి..

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 2 : తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని 108, 104 ఉద్యోగులకు ఇచ్చిన విధం గా నెలకు రూ.పాతిక వేలు జీతం ఇవ్వాలని కోరుతూ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. యూనియన్‌ నాయకులు మాట్లా డుతూ ఆరేళ్లుగా 300 మంది సిబ్బంది చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామ న్నారు. ఉద్యోగులను తొలగించకుండా పర్మినెంట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.  కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరావు, సీహెచ్‌ రాజారావు, ఎన్‌. సత్యం, ఎస్‌ఎన్‌ఎం ఫణి, పి.అశోక్‌కుమార్‌, శివాజీ తదితరులు పాల్గొన్నారు.  


 ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్లకు ప్రమాదం ..

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఆగస్టు 2 : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడుతుందని ఇప్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు అన్నారు. ఆర్‌డబ్ల్యూసీ గొడౌన్‌ వద్ద ఇప్టూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించారు. వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ అణిచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంబేడ్కర్‌ రిజర్వేషన్లు కల్పించార న్నారు. నేటి పాలకులు రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నా రన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానానికి  వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. జి.లాజర్‌, బి.ఏడుకొండ లు, కె.వెంకటేశ్వరరావు, ఎన్‌.వెంకటేశ్వరరావు, జ్యోతి, ఏడుకొండలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-03T05:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising