ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోక్షమెప్పుడు..?

ABN, First Publish Date - 2021-06-20T04:31:19+05:30

దెందులూరు మండల పరిధిలోని గుండుగొలను (శింగవరం)లో 16 నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గోదావరి– ఏలూరు కాల్వపై నిర్మించిన ఇరుకు వంతెనతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.

ఇరుకు వంతెన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగవరంలో ఇరుకు వంతెనతో లంక గ్రామాల ప్రజల వెతలు

దెందులూరు, జూన్‌ 19: దెందులూరు మండల పరిధిలోని గుండుగొలను (శింగవరం)లో 16 నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గోదావరి– ఏలూరు కాల్వపై నిర్మించిన ఇరుకు వంతెనతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దెందులూరు, భీమడోలు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన ప్రజలు, చేపల చెరువుల యజమానులు ఈ వంతెనపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. భీమడోలు మండలంలోని లంక గ్రామాలకు చెందినవారు, ఏలూరు గ్రామీణ మండ లంలోని ప్రజలు జాతీయ రహదారిని చేరడానికి ఈ వంతెనే ప్రధాన ఆధారం. ఈ వంతెన నిర్మించి సుమారు 120 సంవత్సరాలు ఆవుతోంది. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు అందుతూనే ఉన్నాయి. నేటికీ వంతెన బలంగానే ఉన్నప్పటికి జనాభా పెరిగిన నేపథ్యంలో రాకపోకలకు వంతెన సరిపోవడం లేదు. దీనికి తోడు వంతెనకు ఉన్న రక్షణ గోడను కొంత కాలం క్రితం లారీ ఢీకొనడంతో రక్షణ గోడ పాడైపోయింది. చేపలు, రొయ్యల చెరువులు పెరగడంతో వీటికి మేతలు తీసుకొచ్చే లారీల సం ఖ్య పెరిగిపోయింది. ఈ ఇరుకు వంతెన మీద నుంచి ఒక వాహనం మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు మిగిలిన వాహనాలు నిలిచిపోవాలి. రహదారికి ఇరువైపులా మార్జిన్‌ అంతంత మాత్రంగా ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇరుకు వంతెన స్థానంలో కొత్తవంతెన ఏర్పాటు చేయాలని పోతునూరు, లక్ష్మీపురం, గుండుగొలను, కొమిరే పల్లి, చెట్టున్నపాడు, లంక గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. 


 నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలి

నాగనబోయిన శ్రీనివాసరావు, చేపల చెరువు రైతు

గుండుగొలను వద్ద ఉన్న ఇరుకు వంతెన వల్ల చేప లకు మేత తీసుకుని వెళ్లేటప్పుడు చాలా ఇబ్బంది అవు తోంది. చాలామంది చేపల చెరువుల రైతులు ఇబ్బం దు లు పడుతున్నారు. ఇప్పటికైనా వెడల్పుగా కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలి.


వాహనాలు తప్పుకునే అవకాశం లేదు

 నున్న లక్ష్మణరావు, పోతునూరు గ్రామస్థుడు

లంక గ్రామాల ప్రజలందరికీ ఈ వంతెనే ప్రధాన ఆధారం. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు ఇరువైపులా వాహనం తప్పు కునే అవకాశం లేదు. ప్రజలు, వాహనదారులను దృష్టిలో పెట్టుకుని ఇరుకు వంతెన స్థానంలో వెడల్పుగా నూతన వంతెన ఏర్పాటు చేయాలి.

Updated Date - 2021-06-20T04:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising