ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్మి కంపోస్టు యూనిట్‌ దగ్ధం : రూ. 8 లక్షల నష్టం

ABN, First Publish Date - 2021-06-22T04:58:45+05:30

పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వర్మి కంపోస్టు యూనిట్‌ షెడ్‌ దగ్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, జూన్‌ 21: పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వర్మి కంపోస్టు యూనిట్‌ షెడ్‌ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.  గ్రామానికి చెందిన మన్నె రవి  వర్మీ కంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని వానపాముల ఎరువును తయారుచేసి విక్రయిస్తుంటాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో షెడ్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో  దగ్ధమైంది. కాగా బాధిత రైతు మన్నే రవి కరోనాతో  హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స  పొందుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఇటీవలే చనిపోయారు. ఆ బాధ మరువక ముందే ఇప్పుడు షెడ్డు దగ్ధమై నష్టం వాటిల ్లడంతో  ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతోంది. బాధిత రైతు ను సర్పంచ్‌  పెద్దపెంటయ్య, మాజీ సర్పంచ్‌ సుధాకర్‌ తదితరులు పరామర్శించారు. 

Updated Date - 2021-06-22T04:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising