ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సొమ్ము ఏమైంది..?

ABN, First Publish Date - 2021-04-15T05:25:59+05:30

మునిసిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల ఖాతాలకు తొమ్మిది నెలలుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ములు జమ కావడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొమ్మిది నెలలుగా జమ కాని ఈఎస్‌ఐ, పీఎఫ్‌

పారిశుధ్య కార్మికుల జీతాల నుంచి మినహాయింపు

ఈఎస్‌ఐ వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులకు

జిల్లాలో మూడు వేల కుటుంబాల అవస్థలు

తణుకు, ఏప్రిల్‌ 14 : మునిసిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల ఖాతాలకు తొమ్మిది నెలలుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సొమ్ములు జమ కావడం లేదు. జిల్లాలో ఏలూరు నగర పాలక సంస్థ సహా, భీమవరం తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో మూడు వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికి ప్రతీ నెలా జీతంలో ఈఎస్‌ఐ, పీఎఫ్‌ నిమిత్తం ఒక్కో కార్మికుడికి రూ.1,600 మినహాయిస్తున్నారు. ఈ మొత్తానికి మునిసిపాలిటీ నుంచి ఒక్కొక్కరికి రూ.1,800 చొప్పున కలిపి రూ.3,400 ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఖాతాలకు జమ చేయాలి. కానీ, వీరి ఖాతాలకు 2020 జూలై నుంచి జమ చేయడం లేదు. ఇప్పటి వరకు ఈ మొత్తం తొమ్మిది కోట్ల 18 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఈఎస్‌ఐలో వైద్య చికిత్సలు పొందలేకపోతున్నట్టు కార్మికులు వాపోతున్నారు. అలాగే మందులు, సెలవులు, ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారాలను కోల్పోతున్నట్టు చెబుతున్నారు. మున్సిపల్‌ అధికారులు మాత్రం వీరి పేరిట చెల్లించాల్సిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ మొత్తాలను ప్రతీ నెలా ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌కు చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. 


ఎన్నో సమస్యలు 

మరో వైపు పట్టణాలను క్లీన్‌గా.. ఆరోగ్యంగా ఉంచడంలో వీరి పాత్ర చాలా ఎక్కువ. ఒక్కరోజు వీరు విధులకు హాజరుకాకపోతే దుర్గంధ భరితంగా తయారవుతుంది. ప్రజలు ఇళ్లల్లో సైతం ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వీరిపై చిన్నచూపు తగదని విమర్శలు వస్తున్నాయి. వచ్చే 18 వేల జీతంలోనే కుటుంబ పోషణ చేయాలి. ఈలోగా అనారోగ్యం పాలైతే ఆసుపత్రులకు పరుగులు తీయాలి. వైద్య పరీక్షల నిమిత్తం వేలకు వేలు పోయాలి. అదే ఈఎస్‌ఐ కింద సొమ్ములు కట్‌ చేస్తున్నారు కాబట్టి.. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. మరోవైపు పారిశుధ్య పనుల నిమిత్తం అవసరమైన పనిముట్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. కానీ నూనె, సబ్బులు, బట్టలతోపాటు పనిముట్లను ఇవ్వడం లేదు. ఉన్నవాటితోనే పనులు నెట్టుకొస్తున్నారు. 


ఎవరిది బాధ్యత ? 

నీలాపు ఆదినారాయణ, తణుకు

మునిసిపల్‌ అధికారులు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వాటా చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. కార్మికుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. పనిచేసేందుకు అవసరమైన పనిముట్లను కూడా ఇవ్వడం లేదు.


నలిగిపోతున్నాం 

ఎం.నాగేంద్రకుమార్‌, తణుకు 

నెలనెలా మా జీతాల నుంచి డబ్బులు కటింగ్‌ అవుతున్నాయి. అయినా ఖాతాలో జమ కావడం లేదు. అధికారుల మధ్యలో మేం నలిగిపోతున్నాం. దీనికి ప్రభుత్వం ఏదో ఒక దారి చూపించాలి.


ఆ డబ్బు ఏమైంది 

పీవీ ప్రతాప్‌, సీపీఎం నాయకుడు

ప్రభుత్వం ప్రతీ నెలా కట్‌ చేస్తున్న సొమ్ము కార్మికుల ఖాతాలో జమ కావాలి. జీతంలో తగ్గిన డబ్బులు అప్కాస్‌లో జమ అయిందో లేదో చూడాలి. కానీ, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఇప్పటికే నెలలు గడుస్తున్నా సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2021-04-15T05:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising