ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్‌ చేసి చంపారు..

ABN, First Publish Date - 2021-02-25T05:13:19+05:30

రొయ్యల వ్యాపారిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో ఏడుగురుని అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి తెలిపారు.

నిందితులను మీడియాకు చూపిస్తున్న నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొయ్యల వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు

ఏడుగురి అరెస్టు.. ఇద్దరు పరారీ

ఆర్థిక లావాదేవీలే  కారణం

భీమవరం క్రైం, ఫిబ్రవరి 24 : రొయ్యల వ్యాపారిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో ఏడుగురుని అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి తెలిపారు. బుధవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భీమవరం బల్సుమూడికి చెందిన రెడ్డి కోదండ రామారావు (రాం బాబు) (39)కు కాళ్ళ మండలం దొడ్డనపూడికి చెందిన గుండా వీరాస్వామికి రొయ్యల వ్యాపారంలో కొంత కాలంగా లావాదేవీలు జరిగాయి. ఈ విషయంలో వీరాస్వామికి కోదండ రామారావు రూ.2 కోట్లు బకాయి పడ్డాడు. ఈ విషయంపై ఇద్దరు పలుమార్లు ఘర్షణలు కూడా పడ్డారు. అయితే ఇటీవల కోదండ రామారావు వ్యాపారంలో నష్టపోయారు. వీరాస్వామి తన స్నేహితుడైన దొడ్డనపూడి గ్రామానికి చెందిన వడ్డీ శివన్నారాయణతో మాట్లాడారు. వీరు మరికొంత మందితో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్‌ వేశారు. ఈనెల 11వ తేదీ రాత్రి కోదండ రామారావు ఇంటికి వెళుతుండగా డీఎన్నార్‌ కళాశాల వద్ద ఆపి కారులో కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్ళారు. భీమవరం రెండవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా నాలుగు రోజుల అనంతరం తెలంగాణలోని భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట శివారు జీడి మామిడి తోటల్లో మృతదేహం ఉందంటూ సమాచారం రావడంతో భీమవరం పోలీసులు మృతుడి భార్య లీలాకుమారిని తీసుకుని అక్కడకు వెళ్లగా మృతదేహం కోదండ రామారావుది అని తేలింది. 

మార్గ మధ్యలోనే హత్య..

గుండా వీరాస్వామికి కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన అల్లూరి స్మితేష్‌వర్మ కారును సమకూర్చారు. దీంతో కిరాయి నిందితులు అయిన కేతా సూర్య చైతన్య, కేతా భరత్‌ వెంకట సుధీర్‌, అప్పాబత్తుల కృష్ణ వంశీ, కుతాడి రమేష్‌, బుర్రా మణికంఠ, ఆవుల కొండలు కారులో కిడ్నాప్‌ చేసి తీసుకువెళుతుండగా రూ.2 కోట్లు నగదు నీ భార్యతో చెప్పి ఇప్పించమని హెచ్చరించారు. అయినా కూడా కోదండ రామారావు వినకపోవడంతో దారిలోనే హత్యచేసి అశ్వారావుపేట శివారు జీడిమామిడి తోటలోకి తీసుకువెళ్ళి అక్కడ మృతదేహాన్ని పడవేశారు. టూటౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ రాంబాబులు దర్యాప్తు అనంతరం బుధవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో ఆవుల కొండ, కేతా భరత్‌ వెంకట సుధీర్‌లను అరెస్టు చేయాల్సి ఉన్నది.హత్యకు ఉపయోగించిన మూడు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.  

Updated Date - 2021-02-25T05:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising